![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1018 లో....రాజుని లక్కీ పక్కకి పిలిచి మాట్లాడతాడు. ఆ నందు ఏంటీ ఇక్కడ ఉంది. ఇందు ఫోటో పట్టుకొని వెతికింది కదా.. ఇప్పుడు మనం ఇందు ని కిడ్నాప్ చేశామని తెలిసిపోయి ఇదంతా యాక్టింగ్ చేస్తున్నారు కావచ్చు.. నాకు భయంగా ఉందని లక్కీ అంటాడు. అప్పుడే నందు వచ్చి.. ఒరేయ్ మా అక్కని కిడ్నాప్ చేసింది మీరే అని నాకు తెలుసు.. మీరు పడుకున్నప్పుడు అక్కని తీసుకొని వెళదామని వచ్చాను కానీ అక్క రాను అంది మీ దగ్గరే కిడ్నాప్ అయి ఉంటాను అంది అని నందు చెప్తుంది. అయినా మేం కిడ్నాప్ చేశామని ఎవరు చెప్పారని లక్కీ అనగానే లోపల కిడ్నాప్ చేసిన వాళ్ళ బట్టలు బయట ఆరెస్తే తెలిసిపోతుందని నందు అంటుంది.
అది తర్వాత ముందు ఇప్పుడున్న కార్యక్రమం జరగనివ్వండి అని నందు అంటుంది. ఆ తర్వాత వంటలు చేస్తుంటే అప్పుడే రాజుకి కళ్ళలో ఏదో పడుతుంది. అది చూసి నన్ను చూడనివ్వండి అంటూ రాజుని దగ్గరికి తీసుకొని కళ్ళలో పడ్డది తీసేస్తుంది ఇందు. వాళ్ళని చూసిన రాజు వాళ్ళ అమ్మానాన్న లక్ష్మీ, చలపతి ఇద్దరు ఆ అమ్మాయి ఈ ఇంటికి కోడలు అయితే బాగుంటుందని అనుకుంటారు. ఆ దేవుడు వాళ్ళకి బ్రహ్మముడి వేస్తే బాగుండు అని అనుకుంటారు. ఆ తర్వాత రాజు, లక్కీ కుర్చీలు సెట్ చేస్తుంటారు. ఇవి కొట్టేసుకొని వచ్చారా అని ఇందు అంటుంది. మేం అయితే అడిగి తీసుకొని వస్తాము.. మీరు అయితే కొట్టేసుకొని వస్తారని ఇందు అంటుంది.
ఆ తర్వాత అందరు ఒక్కొక్కరుగా వస్తుంటే.. వాళ్ళకి దగ్గర ఉండి మర్యాదలు చేస్తారు. ఈ అమ్మాయి ఎవరో గానీ చాలా తెలివి గల అమ్మాయి.. ఉన్న వాటితో వంటలు చేసిందని చలపతి అంటాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి నిమ్మకాయ రసం ఇస్తారు. దానికి ఫ్రూట్ పంచ్ అని పేరు పెడుతారు. అందరు అది తాగి బాగుందని అంటారు. నా ప్లాన్ ఎలా ఉందని రాజుతో ఇందు అంటుంది. నువ్వు చాలా తెలివిగల దానివే అని రాజు అంటాడు. తరువాయి భాగంలో వచ్చిన వాళ్ళందరు ఇందుని చూసి ఈ అమ్మాయి ఎవరు బాగుంది రాజుకి ఇచ్చి పెళ్లి చెయ్యండి అని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |